mallya: విజయ్ మాల్యాపై రాబర్ట్ వాద్రా ఆగ్రహం!

షార్ట్స్‌లో చూడండి
లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాపై సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా మండిపడ్డారు. రాబర్ట్ వాద్రా, వీరభద్రసింగ్ లా తాను కూడా రాజకీయ బాధితుడినే అంటూ మాల్యా చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇతరుల సొమ్ముతో తాను విదేశాలకు ఉడాయించలేదని... తన పేరును అనవసరంగా వాడుకోవద్దని సూచించారు. ఏ విషయంలో కూడా మాల్యాకు, తనకు పోలిక లేదని వాద్రా చెప్పారు.

తాను కూడా రాజకీయ బాధితుడినే... కానీ, ఎన్నడూ తన హోదాను దుర్వినియోగం చేయలేదని అన్నారు. వేరొకరి సొమ్ముతో భారత్ ను విడిచి వెళ్లలేదని చెప్పారు. మాల్యాను భారత్ కు అప్పగించాలనే కేసు విచారణ సందర్భంగా బ్రిటన్ కోర్టులో మాల్యా తన వాదనను వినిపిస్తూ వాద్రా, వీరభద్ర సింగ్ లానే తనను కూడా భారత ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే, మాల్యాపై వాద్రా మండిపడ్డారు. 
Go Back to Shorts
mallya
robert vadra

More Telugu News