త్రివిక్రమ్ తీస్తున్న సినిమాలో పాట పాడనున్న పవన్ కల్యాణ్?
- 'కొడకా... కోటేశ్వరా!' అంటూ సాగే పాట
- గతంలో రెండు సార్లు గొంతు సవరించిన పవన్
- సంగీత దర్శకత్వం వహిస్తున్న అనిరుధ్ రవిచందర్
అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రంలో పవన్ అభిజిత్ భార్గవ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలోని 'బయటికొచ్చి చూస్తే' అనే పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో కీర్తి సురేశ్, అను ఇమ్మాన్యుయేల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. విలన్‌గా బొమన్ ఇరానీ, ఓ కీలక పాత్రలో ఖుష్బూ నటిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్రయత్నిస్తోంది.