నిన్న అయోధ్యలో.. నేడు లక్నోలో శ్రీశ్రీ రవిశంకర్ బిజీబిజీ!
- ముస్లిం మత పెద్దలతో చర్చలు
- శాంతియుత పరిష్కారం కోసమే నా ప్రయత్నం
- నాకు ఏ అజెండా లేదు- శ్రీశ్రీ రవిశంకర్
అక్కడి ముస్లిం మత పెద్దలతో చర్చలు జరిపిన అనంతరం శ్రీ శ్రీ రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ.. తాను కోర్టును గౌరవిస్తానని, అదే సమయంలో కోర్టులు ఇచ్చే తీర్పులు మన మనసులకు చేరువ కాలేవన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని తెలిపారు. తాను ఏదో అజెండాతో అక్కడకు రాలేదని, తనకు శాంతియుత పరిష్కారమే ప్రధానమని అన్నారు.