ఎదుటివాళ్ల వ్యక్తిత్వాన్ని చూసి మాత్రమే పవన్ ఎవరినైనా ప్రేమిస్తారు!: బండ్ల గణేశ్
- నిర్మాతగా నాకు పవన్ జన్మనిచ్చాడు
- ఎదుటివారి వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన ప్రేమిస్తాడు
- కష్టపడే తత్వాన్ని బట్టి అవకాశం ఇస్తాడు
- అలా నాకు ఆయన ఓ అవకాశం ఇచ్చాడు
అందుకాయన స్పందిస్తూ .. " పెదనాన్నలు .. బాబాయ్ లు .. ఉండగా తండ్రి అంటేనే ప్రత్యేకమైన అభిమానం ఎందుకు ఉంటుంది? .. జన్మనిచ్చాడు కాబట్టి. అలాగే నిర్మాతగా నాకు పవన్ జన్మనిచ్చాడు. నాన్న మీద ప్రేమ ఉన్నంత మాత్రాన పెదనాన్నలు .. బాబాయ్ ల మీద ప్రేమ లేదని అర్థం కాదు. అలా మిగతా హీరోలన్నా నాకు అభిమానమే. పవన్ ఓ అతీతమైన శక్తి .. అవతలవాళ్ల హోదాను బట్టి ఆయన గౌరవించడు. ఎదుటివాళ్ల వ్యక్తిత్వాన్ని చూసి మాత్రమే ఆయన ఎవరినైనా ప్రేమిస్తాడు. ఆయనలో నాకు నచ్చేది అదే. ఎదుటివాళ్లలో కనిపించే కష్టపడే తత్వాన్ని చూసి అవకాశం ఇస్తాడు .. అలా నాకు ఆయన ఓ అవకాశం ఇచ్చాడు" అని చెప్పుకొచ్చారు.