అమరావతి ప్రాంతంలో కూలిన బ్రిడ్జి... ఆగిన రాకపోకలు!
- కురగల్లు - నిడమర్రు మధ్య కూలిన వంతెన
- భారీ యంత్రాలు తరలిస్తుండటంతో బ్రిడ్జిపై ఒత్తిడి
- బలహీనంగా ఉందని ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
అయితే, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టమూ జరగలేదు. వంతెన కూలడంతో కురగల్లు - నిడమర్రు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న అధికారులు వంతెన ఉన్న ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. కాగా, ఈ వంతెన బలహీనంగా ఉన్నదని గతంలోనే ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఈ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు.