police massage: మహిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకున్న ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు

  • గద్వాల జిల్లాలో అమలవుతున్న ఆర్డర్లీ విధానం
  • మహిళా హోంగార్డుతో బాడీ మసాజ్ చేయించుకున్న ఏఎస్సై హసన్
  • ఎఎస్సైపై సస్పెన్షన్ వేటు వేసిన ఎస్పీ విజయ్ కుమార్
తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఆర్డర్లీ విధానంపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. గద్వాలలోని సాయుధ రిజర్వ్ ఏఎస్ఐగా పని చేస్తున్న హసన్ మహిళా హోంగార్డ్ తో మసాజ్ చేయించుకుంటుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఎస్పీ విజయ్ కుమార్ చేపట్టిన విచారణలో హసన్ ఇలాంటి పనులు చేయించుకున్నట్టు తేలింది. దీంతో తక్షణం హసన్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 
police massage
massage
gadwala
asi
Police

More Telugu News