శశికళ ఆస్తులపై రెండో రోజు కొనసాగుతున్న దాడులు...187 చోట్ల ఒకేసారి దాడులు
- శశికళ ఆస్తులపై ఐటీ దాడులు
- 187 ప్రాంతాల్లో ఒకేసారి ఐటీ దాడులు
- 40 ప్రాంతాల్లో దాడులు పూర్తి.. మరికొన్ని చోట్ల కొనసాగింపు
పన్ను ఎగవేసినట్లు ఆరోపణలతో పాటు.. డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం రావడంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. కాగా, ఈ దాడులపై నిన్న దినకరన్ మాట్లాడుతూ, తన రాజకీయ జీవితంలో ఇలాంటి దాడులు చాలా చూశానని అన్నారు. రాజకీయాల నుంచి వెళ్లగొట్టేందుకు కేంద్రప్రభుత్వం ఇలాంటి దాడులు చేస్తోందని ఆయన ఆరోపించారు. తాను లేకున్నా తన అనుచరులు పార్టీని నడిపిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.