అమెరికాలో ట్రంప్ కు జనాదరణ తగ్గింది.. వాషింగ్టన్ పోస్ట్ కథనం!

  • వాషింగ్టన్ పోస్ట్ సంచలన కధనం
  • ట్రంప్ మాటన్నీ అబద్ధాలేనన్న కథనం
  • ఏడాది పాలనలో ఒక్కటీ సరైన నిర్ణయం తీసుకోలేదని ఆరోపణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు జనాదరణ తగ్గిందని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' నినాదంతో ఆయన ఎన్నికల్లో విజయం సాధించి ఏడాది పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో కధనాన్ని ప్రచురించిన వాషింగ్టన్ పోస్ట్... ట్రంప్ సమర్థవంతమైన ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని ఆరోపించింది. ఆయన మాటలన్నీ అబద్ధాలేనని ప్రజలు గ్రహించారని, అందువల్లే ఆయనకు ప్రజాదరణ తగ్గిందని తెలిపింది. కాగా, ఉత్తరకొరియాతో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్‌ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.  
Go Back to Shorts
america
washington post
special story

More Telugu News