Anushka Shetty: క్రికెటర్ ద్రావిడ్ తో పీకల్లోతు ప్రేమలో పడిపోయా!: హీరోయిన్ అనుష్క

  • ద్రావిడ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి పిచ్చి
  • ఆయనకు వీరాభిమానిని
  • ఓ ఇంటర్వ్యూలో అనుష్క వెల్లడి
దక్షిణాది సినీ రంగంలో అగ్రహీరోయిన్ గా చలామణి అవుతున్న అనుష్క, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లు ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే, అనుష్క ఓ క్రికెటర్ తో పీకల్లోతు ప్రేమలో పడిపోయిందట. ఆయన మరెవరో కాదు మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్! తాను ద్రావిడ్ కు వీరాభిమానినని, ఆయనంటే తనకు చిన్నప్పటి నుంచి పిచ్చి అని, ఒకానొక సమయంలో అతనితో పీకల్లోతు ప్రేమలో పడిపోయానని ఓ ఇంటర్వ్యూలో అనుష్క నవ్వుతూ తెలిపింది.
Anushka Shetty
rahul dravid
anushka love
tollywood

More Telugu News