akbaruddin: బీజేపీని చూసి తెలంగాణ‌ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?: ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌

షార్ట్స్‌లో చూడండి
భార‌తీయ జ‌న‌తా పార్టీని చూసి తెలంగాణ స‌ర్కారు ఎందుకు భయపడుతోందని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఈ రోజు అసెంబ్లీలో అక్బ‌రుద్దీన్ మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు బాగోలేద‌ని అన్నారు. అసెంబ్లీలో సభ్యులు గొడవ చేస్తున్నా సభను నడపటం స‌రైంది కాద‌ని ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సభ ఆర్డర్‌లో లేద‌ని, వాయిదా వేయాలని సూచించారు. స్పీక‌ర్ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని వ్యాఖ్యానించారు. అనంత‌రం స‌భలోంచి ఆయ‌న వాకౌట్ చేశారు.

కాగా, రైతుల సమస్యలపై తెలంగాణ స‌ర్కారు క‌న‌బ‌రుస్తోన్న తీరు బాగోలేద‌ని కాంగ్రెస్‌ పార్టీ కూడా స‌భ‌లోంచి వాకౌట్‌ చేసింది. మద్దతు ధర అడిగినందుకు రైతుల చేతులకు బేడీలు వేయ‌డం ఏంట‌ని కాంగ్రెస్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  
Go Back to Shorts
akbaruddin
mim
assembly

More Telugu News