సముద్రం లోపల విందు.. యూరోప్ లో తొలి అండర్ వాటర్ రెస్టారెంట్!
- నార్వేలో అండర్ వాటర్ రెస్టారెంట్
- 2018లో ప్రారంభం
- ఆసక్తికరంగా నిర్మించిన డిజైనర్లు
దీనిని దక్షిణ నార్వేలో ఏర్పాటు చేశారు. పనోరామిక్ విండోతో దీనిని నిర్మించారు. దీని పొడవు 36 అడుగులు. ఇందులో వంద మంది ఆతిథ్యం స్వీకరించవచ్చు. ఇందులో అడుగు పెట్టగానే సబ్ మెరైన్ లో అడుగుపెట్టినట్టు ఉంటుంది. భారీ అలలు ఎగసిపడినప్పుడు దీనికి ఎలాంటి నష్టం వాటిల్ల కుండా కాంక్రీట్ తో గోడలు నిర్మించారు. ఇది చూసేందుకు షిప్పింగ్ కంటైనర్ లా కనిపిస్తుంది. దీనిని 2018లో ప్రారంభించనున్నారు.

