అమెరికాలో దుండగుడి వీరంగం... చర్చిలో ప్రార్థనలే లక్ష్యం.. భక్తులపై తూటాల వర్షం.. 28 మంది మృతి!
- అమెరికాలో మరో ఉన్మాది కాల్పులు
- చర్చిలో చొరబడి కాల్పులు
- 28 మంది మృతి, 24 మందికి గాయాలు
తుపాకిని పలుమార్లు లోడ్ చేస్తూ కాల్పులు జరిపాడు. దీంతో చర్చిలో ప్రార్థనలు చేస్తున్నవారు హాహాకారాలు చేస్తూ తలోదిక్కుకు పరుగులు తీశారు. ఈ క్రమంలో తూటాలు తగిలి సుమారు 28 మంది నేలకూలారు. మృతుల్లో రెండేళ్ల చిన్నారి కూడా వుండడం కలచివేస్తోంది. ఈ ఘటనలో మరో 24 మందికి గాయాలయ్యాయి. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
కాల్పుల అనంతరం దుండగుడు వాహనంలో పారిపోతూ మరో వాహనాన్ని ఢీకొన్నాడు. దీంతో తన వాహనం నుంచి దిగిపోయి పారిపోయే ప్రయత్నంలో ఉండగా అతడిని పోలీసులు కాల్చిచంపేశారు. ఈ ఘటనపై ట్రంప్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జపాన్ నుంచే తాను పరిస్థితిని సమీక్షిస్తున్నానని తెలిపారు.