రష్యా అధ్యక్ష ఎన్నికల రేసులో పోర్న్ స్టార్.. పుతిన్‌నే భయపెట్టేలా హామీలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రష్యా అధ్యక్ష ఎన్నికల రేసులో పోర్న్ స్టార్.. పుతిన్‌నే భయపెట్టేలా హామీలు!

  • రష్యా పోర్న్ స్టార్ సంచలన ప్రకటన
  • పుతిన్‌కు పోటీగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ
  • ఫక్తు రాజకీయ నాయకురాలిని తలపించిన హామీలు
పోర్న్‌స్టార్లు నటీమణులుగా మారి సినిమాల్లోకి రావడం చూస్తున్నాం. మొన్న సన్నీలియోన్, నిన్న మియాఖలీఫా.. అయితే ఇప్పుడు చెప్పబోయే పోర్న్ స్టార్ మాత్రం తనకు సినిమాలు ఎంతమాత్రమూ పడవని చెబుతూ ఏకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కే ఎసరు పెట్టేలా కనిపిస్తోంది.

ఎలెనా బెర్కోవా అనే 32 ఏళ్ల ఈ మాజీ పోర్న్ స్టార్ అధ్యక్ష ఎన్నికల కోసం సిద్ధమవుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో పాల్గొనబోతున్నట్టు పేర్కొంది. తనను గెలిపిస్తే దేశాన్ని సంస్కరణపథంలో నడిపిస్తానని పేర్కొంది. అంతేకాదు.. స్కూళ్లలో సెక్స్ ఎడ్యుకేషన్ ప్రవేశపెడతానని, లైంగిక వేధింపులకు పాల్పడేవారికి మరణశిక్ష విధించేలా చట్టాన్ని తీసుకొస్తానని ప్రజలకు హామీ ఇచ్చింది.

దత్తత చట్టాన్ని మరింత కఠినతరం చేస్తానని, దత్తత తీసుకోబోయే పిల్లల ఆరోగ్యంపై హామీ ఇచ్చే వారికి, పన్నులు సక్రమంగా చెల్లించే వారికే దత్తత లైసెన్స్ ఇచ్చేలా చట్టాన్ని తీసుకొస్తానని పేర్కొంది. అన్నింటి కంటే ముఖ్యంగా ‘క్లాథింగ్ సెన్సార్‌షిప్’ పేరుతో మహిళలు తమ స్కర్టు సైజును 40 సెంటీమీటర్లకు తగ్గకుండా ఉండేలా నియంత్రిస్తానని బెర్కోవా హామీల వర్షం గుప్పించింది.

దేశంలో పేదరికాన్ని పారదోలేందుకు పేదలకు వడ్డీలేని రుణాలు ఇస్తానని, కారణం లేకుండా ఊరికే ఇంట్లో కూర్చునే వారిని శిక్షించేందుకు సోవియట్ యూనియన్ కాలం నాటి పాత చట్టాలను పునరుద్ధరిస్తానని పేర్కొంది. అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనేవారి కనీస వయసును 35 ఏళ్లు చేస్తానంటూ ఫక్తు రాజకీయ నాయకుడిని తలపించేలా హామీలు గుప్పించింది. అయితే ఆమె ప్రస్తుత వయసు 32 ఏళ్లే కావడం గమనార్హం.

బెర్కోవా ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడానికి ముందే ఇటీవల రష్యన్ టీవీ హోస్ట్, మోడల్ అన్ఫిసా చెకోవా కూడా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. ఇప్పుడు బెర్కోవా రంగంలోకి దిగింది. కాగా, 2000  సంవత్సరంలో పోర్న్ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన బెర్కోవా 20 అడల్ట్ సినిమాలు చేసింది. 2004లో ఆమె చివరి వీడియో రిలీజై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
porn star
Russia
Presidnet
Election
Putin

More Telugu News