నారాయణ ఆడియో టేపుల వ్యవహారంలో మరో ట్విస్ట్... డబ్బు తీసుకుని అలా మాట్లాడానంటున్న సరిత!
- మాట మార్చిన సరితా అగర్వాల్
- లైంగికంగా వేధించి బెదిరించారు
- అలా మాట్లాడకుంటే అంతు చూస్తామన్నారు
- రూ. 2 లక్షలు ఇచ్చారన్న సరితా అగర్వాల్
అలా మాట్లాడకుంటే పిల్లలను కూడా బతకనీయబోమని హెచ్చరించారని, ఒత్తిడిలో తాను అలా మాట్లాడానని సరిత వెల్లడించారు. అయితే, ఎవరు అలా మాట్లాడించారన్న విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. తనకు ప్రాణభయం ఉందని సరిత ఆందోళన వ్యక్తం చేశారు. తాను పదేళ్లుగా నారాయణలో పనిచేస్తున్నానని, ఇంత మానసిక వేదనను అనుభవిస్తానని అనుకోలేదని వాపోయారు.