మహిళలకు రక్షణ విషయంలో గోవాకు మొదటిస్థానం... నివేదికలో వెల్లడి
- నివేదిక విడుదల చేసిన మహిళా శిశు సంక్షేమ శాఖ
- ఆరోగ్యం విషయంలో కేరళ మొదటి స్థానం
- చివరి స్థానంలో బిహార్
ఈ జాబితాలో కేరళ, మిజోరాం, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాలు అగ్రస్థానాల్లో నిలిచాయి. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో బాలికలకు పెద్దగా రక్షణ లేదని నివేదిక వెల్లడించింది. విద్యా, ఆరోగ్యం, పేదరికం రంగాల్లో మహిళలకు రక్షణ గురించి ఈ నివేదిక రూపొందించారు. ఆరోగ్యంలో కేరళ మొదటి స్థానం సంపాదించింది. బిహార్ అతి తక్కువ రక్షణ కల్పిస్తూ చివరి స్థానంలో నిలిచింది.