విదేశీయుడైన టీజీ వెంకటేష్ వెంటనే దేశం విడిచి వెళ్లాలి: దళిత, ప్రజా సంఘాలు

  • టీడీపీకి అమ్ముడుబోయిన వ్యక్తి టీజీ
  • ఆయన జీవితమంతా కొనడం, అమ్మడమే
  • టీజీది మధ్య ఆసియా దేశం
ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి అమ్ముడుబోయిన వ్యక్తి టీజీ వెంకటేష్ అంటూ కర్నూలు జిల్లా దళిత, ప్రజా సంఘాల నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీజీ జీవితమంతా అమ్మడం, కొనడంతోనే ముడిపడిందని అన్నారు. విదేశీ ఆర్యవైశ్యులు, విదేశీ బ్రాహ్మణులు వెంటనే ఈ దేశాన్ని విడిచి పోవాలని డిమాండ్ చేశారు.  వెంకటేష్ ది మధ్య ఆసియా దేశమని... ఇతర దేశానికి చెందిన ఆయనకు ఈ దేశ మూలవాసి కంచ ఐలయ్యను విమర్శించే అర్హత లేదని మండిపడ్డారు.

దేశంలోని స్థితిగతులు, జన జీవనంపైనే ఐలయ్య పుస్తకాన్ని రాశారని... కానీ టీజీ వెంకటేష్ లాంటి వ్యక్తులు ఐలయ్యను చంపాలి, పుస్తకాన్ని నిషేధించాలంటూ కారుకూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐలయ్య దళిత, బహుజనుల సంపద అని... అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశ మూలవాసులపై ఉందని అన్నారు.  
Go Back to Shorts
tg venkatesh
kancha ilaiah

More Telugu News