రాహుల్ గాంధీకి అకిడో బ్లాక్ బెల్ట్ నిజమే... సాక్ష్యమిదిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాహుల్ గాంధీకి అకిడో బ్లాక్ బెల్ట్ నిజమే... సాక్ష్యమిదిగో!

  • బ్లాక్ బెల్ట్ వచ్చిందని చెప్పిన రాహుల్ గాంధీ
  • ఫొటోలు చూపించి ఆదర్శంగా నిలవాలన్న బీజేపీ నేతలు
  • విడుదల చేసిన కాంగ్రెస్
తనకు జపాన్ మార్షల్ ఆర్ట్స్ లో భాగమైన అకిడోలో బ్లాక్ బెల్ట్ వచ్చిందని ఇటీవల రాహుల్ గాంధీ వెల్లడిస్తే, బీజేపీ విమర్శలు గుప్పిస్తూ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. వాటిని విన్న రాహుల్, తనకు బ్లాక్ బెల్ట్ నిజమేనని, అందుకు సంబంధించిన సాక్ష్యాన్ని చూపిస్తానని ప్రామిస్ కూడా చేశారు. రాహుల్ ఇచ్చిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలుపుకుంది. రాహుల్ అకిడో ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలను, ఆయన బ్లాక్ బెల్ట్ ఫొటోలను తాజాగా విడుదల చేసింది.

ఈ మేరకు కాంగ్రెస్ నేత, నటి దివ్యా స్పందన ఓ ట్వీట్ చేస్తూ కొన్ని ఫొటోలు ఉంచారు. గత వారంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రాజకీయ నాయకులు క్రీడలను ప్రమోట్ చేసేందుకు పెద్దగా ముందుకు రావడంలేదని ఒలింపియన్ విజేందర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తాను రోజూ గంట కాలాన్ని వ్యాయామం, క్రీడలకు కేటాయిస్తానని చెప్పుకుంటూ, అకిడోలో బ్లాక్ బెల్ట్ వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఆపై అందుకు సంబంధించిన వీడియో పెట్టి నలుగురికీ ఆదర్శంగా నిలవాలని విజేందర్ సూచించగా, సరేనని రాహుల్ సమాధానం ఇచ్చారు. రాహుల్ అకిడో ప్రాక్టీస్ ఫొటోలు చూడండి.
 
rahul gandhi
akido
black belt

More Telugu News