టీడీపీలో మరో వికెట్ డౌన్... సంగారెడ్డి అధ్యక్షురాలు రాజీనామా చేస్తూ చంద్రబాబుకు రాసిన లేఖ ఇది!
- కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడాలి
- రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదు
- రేవంత్ తో కలసి పోరాడతాను
- చంద్రబాబుకు రాజీనామా లేఖ రాసిన శశికళ
- అన్యధా భావించవద్దని వినతి
తన లేఖను చంద్రబాబుకు పంపుతూ, అదే లేఖను మీడియాకు విడుదల చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటాన్ని, ఆపై రాష్ట్రం వచ్చిన తరువాత పరిస్థితులను ఆమె తన లేఖలో ప్రస్తావించారు. ఓ కుటుంబ పాలనలో తెలంగాణ ఉందని, ఈ పరిస్థితి వస్తుందని తాము ఊహించలేదని అన్నారు. ఎదురు తిరుగుతున్న వారిపై టీఆర్ఎస్ సర్కారు కేసులు పెడుతోందని విమర్శలు గుప్పించారు. ఇకపై రేవంత్ నేతృత్వంలో తెలంగాణ వ్యాప్తంగా తిరగాలని నిర్ణయించుకున్నట్టు తెలుపుతూ, తన నిర్ణయాన్ని మన్నించాలని కోరారు. ఆమె రాసిన లేఖను మీరూ చూడవచ్చు.

