anupama: ఇండస్ట్రీలో నా బెస్ట్ ఫ్రెండ్ శర్వానంద్ : అనుపమ పరమేశ్వరన్

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై కథానాయికగా వరుస విజయాలను అందుకుంటూ అనుపమ పరమేశ్వరన్ దూసుకుపోతోంది. ఆమె తాజా చిత్రంగా 'ఉన్నది ఒకటే జిందగీ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో తన పాత్రకి లభిస్తోన్న రెస్పాన్స్ పట్ల అనుపమ ఆనందాన్ని వ్యక్తం చేసింది. అంతా తన పాత్రను గురించి మాట్లాడుకోవడం చూస్తుంటే గర్వంగా అనిపిస్తోందని చెప్పింది.

 ఇక ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరనే ప్రశ్నకు .. తోటి హీరోయిన్స్ అంతా తనతో ఫ్రెండ్లీగానే ఉంటారని అంది. సాయిపల్లవి తరచూ తనతో మాట్లాడుతూ ఉంటుందని చెప్పింది. ఇక హీరోల్లో బెస్ట్ ఫ్రెండ్ అంటే శర్వానంద్ అని స్పష్టం చేసింది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'శతమానం భవతి' వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది కూడా. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని జోడీగా నటిస్తోన్న అనుపమ, కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ సరసన చేయనుంది.      
Go Back to Shorts
anupama

More Telugu News