జియో బై బ్యాక్ ఆఫ‌ర్‌ను ఐఫోన్ ఎక్స్‌కి కూడా విస్త‌రించిన జియో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జియో బై బ్యాక్ ఆఫ‌ర్‌ను ఐఫోన్ ఎక్స్‌కి కూడా విస్త‌రించిన జియో

  • 70 శాతం బై బ్యాక్‌ను అందించ‌నున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌
  • ఇప్ప‌టికే ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్ల‌స్‌ల‌పై అందుబాటులో ఉన్న ఆఫ‌ర్‌
  • జియో స్టోర్లు, అమెజాన్‌లో కొన్న‌వారికి మాత్ర‌మే
భార‌త్‌లో ఆపిల్ ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్ల‌స్‌ల‌పై అందించిన జియో బై బ్యాక్ ఆఫ‌ర్‌ను ఐఫోన్ ఎక్స్ కొనుగోళ్ల‌కు కూడా విస్త‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. జియో గుర్తించిన ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్ స్టోర్లలో ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్ల‌స్‌ల‌తో పాటు, న‌వంబ‌ర్ 3 నుంచి ప్రారంభం కానున్న ఐఫోన్ ఎక్స్ అమ్మ‌కాలపై కూడా 70 శాతం బై బ్యాక్ ఆఫ‌ర్‌ను అంద‌జేయ‌నున్న‌ట్లు జియో చీఫ్ ఆఫ్‌ స్ట్రాట‌జీ ఆకాశ్ అంబానీ ప్ర‌క‌టించాడు.

ఈ ఆఫ‌ర్ ప్ర‌కారం జియో స్టోర్‌, రిల‌య‌న్స్ డిజిట‌ల్ స్టోర్‌, జియో.కామ్‌, మై జియో యాప్‌, అమెజాన్.ఇన్‌ల‌లో ఐఫోన్ ఎక్స్ కొని, జియో సిమ్‌తో సంవ‌త్స‌రకాలం వాడి తిరిగి ఇచ్చే ఒప్పందానికి ఒప్పుకున్న‌వారికి 70 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ వ‌ర్తించ‌నుంది. అలాగే ఐఫోన్ల‌లో జియో నెట్‌వ‌ర్క్ వాడుతున్న వారికి కొన్ని ప్ర‌త్యేక టారిఫ్‌ల‌ను కూడా జియో ప్ర‌క‌టించింది. వీరు రూ. 799తో రీఛార్జీ చేసుకుంటే 90 జీబీ డేటా, ఫ్రీ వాయిస్, ఎస్సెమ్మెస్ స‌దుపాయం క‌ల్పించారు. ఈ టారిఫ్ పోస్ట్‌పెయిడ్ వారికి నెల రోజుల ప‌రిమితి, ప్రీపెయిడ్ వారికి 28 రోజుల కాల‌ప‌రిమితితో ల‌భిస్తుంది.
jio buy back
akash mukesh ambani
iphone 8
8s
x
amazon
jio store

More Telugu News