Revanth Reddy: నేను ఆ ప్ర‌శ్న అడ‌గ‌గానే అసెంబ్లీని వాయిదా వేశారు: రేవంత్ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో ఇటీవల వెలుగుచూసిన డ్రగ్స్ మాఫియాపై ఈడీతో విచారణ జరిపించాలని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విష‌యంపైనే తాను ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకుండానే సభను వాయిదా వేశారని ఆయ‌న ఆరోపించారు. ఈ రోజు అసెంబ్లీ ప్రాంగ‌ణంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ‌ మంత్రి కేటీఆర్‌కు డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉందని తాను భావిస్తున్న‌ట్లు చెప్పారు.

కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు డ్రగ్స్ కేసుతో సంబంధాలున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాను అన్ని ఆధారాలతోనే ఈ ఆరోపణలు చేస్తున్నానని చెప్పారు. తెలంగాణ‌లో డ్రగ్స్ విషయంపై తాను ఇప్ప‌టికే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు.  
Go Back to Shorts
Revanth Reddy
KtR
case

More Telugu News