హైదరాబాద్‌లో రహదారిపై యువతి వీరంగం.. వాహనదారుడిపైకి దూసుకెళ్లిన వైనం!
- బేగంపేట రహదారిపై వేగంగా కారు నడిపిన యువతి
- సరిగ్గా నడపమని చెప్పినందుకు వాహనదారుడిని కొట్టబోయిన యువతి
- అడ్డుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్
ఇద్దరికీ నచ్చచెప్పి ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడి నుంచి వారిని పంపించిన తరువాత కూడా ఆ యువతి ఊరుకోలేదు. తనతో గొడవపడ్డ వాహనదారుల బైక్ ను తన కారుతో వెంబడించి మరోసారి గొడవ పెట్టుకుంది. ఈ దృశ్యాలను వాహనదారులు తమ కెమెరాల్లో బంధించారు. ఆ యువతి తీరుపై మండిపడ్డారు. ఆ యువతికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.