నగరిలో ఇల్లు కట్టించుకుంటోన్న ఎమ్మెల్యే రోజా
- సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తున్న రోజా
- నగరిలో తన ఇంటి నిర్మాణ పనుల పరిశీలన
- నగరిలో పలువురు నేతలతో రోజా భేటీ
తమ నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఆమె నగరిలోనే ఇల్లు నిర్మిస్తున్నారు. ఈ రోజు నగరిలో తన ఇంటి నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన కొత్త ఇల్లు నిర్మాణంలో ఉందని తెలిపారు.
అంతకు ముందు ఆమె నగరిలో పలువురు నేతలను కలిశారు. నగరి మునిసిపల్ వైస్ ఛైర్మన్ పి.జి. నీలమేఘం పెద్ద అన్న పి.జి.సోమసుందరం మొదలియార్ మృతి చెందిన నేపథ్యంలో నగరి చింతలపట్టెడలో ఆయన కుటుంబ సభ్యులను తాను పరామర్శించినట్లు పేర్కొన్నారు.

