తల్లయిన నటి అసిన్.. పండంటి పాపకు జన్మనిచ్చిన అందాలభామ!

  • గతేడాది మైక్రోమ్యాక్స్ సీఈవో రాహుల్ శర్మతో వివాహం
  • ఈ నెల 26తో 31వ వసంతంలోకి అసిన్
  • మర్చిపోలేని బర్త్‌డే గిఫ్ట్ అని వ్యాఖ్య
ప్రముఖ నటి అసిన్, రాహుల్ శర్మ దంపతులకు పండంటి పాప జన్మించింది. ఈనెల 26తో 31వ వసంతంలోకి అడుగుపెడుతున్న అసిన్‌ తనకు ఇది గొప్ప బర్త్‌డే గిఫ్ట్ అని పేర్కొంది. తమకు పాప జన్మించినట్టు రాహుల్, అసిన్‌లు మీడియాకు తెలిపారు.  మైక్రోమ్యాక్స్ సీఈవో అయిన రాహుల్ శర్మ మాట్లాడుతూ గడిచిన తొమ్మిది నెలలు తమ జీవితంలో చాలా ముఖ్యమైనవని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో తమ వెంట నిలిచి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నట్టు పేర్కొన్నారు.

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘గజినీ’ సినిమా రీమేక్‌తో అసిన్ బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఈ  సినిమాలో ఆమిర్‌ఖాన్‌తో కలిసి నటించింది. తెలుగులో రవితేజ సరసన ‘అమ్మ, నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమాలో నటించింది. గతేడాది జనవరి 19న రాహుల్ శర్మను వివాహం చేసుకుంది. తొలుత క్రిస్టియన్ వివాహ పద్ధతిలోను తర్వాత, హిందూ వివాహ పద్ధతిలోను వీరి వివాహం జరిగింది.
Go Back to Shorts
Actress
Asin
Rahul Sharma
baby girl
birth

More Telugu News