ex ips sanjeeb bhatt: ఒక్క ముస్లిం కూడా లేడన్న మాజీ ఐపీఎస్ అధికారికి ఘాటు సమాధానం ఇచ్చిన హర్భజన్

  • టీమ్ లో ఒక్క ముస్లిం కూడా లేడన్న సంజీవ్ భట్
  • మండిపడ్డ హర్భజన్
  • క్రీడల్లోకి కులం, మతాలను తీసుకురావద్దని సూచన

ప్రశాంతంగా ఉన్న భారత క్రికెట్ రంగంలో ఓ మాజీ ఐపీఎస్ అధికారి చిచ్చు రేపారు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో ఒక్క ముస్లిం కూడా లేడనే అంశాన్ని ఆయన లేవనెత్తారు. 'దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లలో ఒక్క ముస్లిం అయినా ఉన్నాడా? లేక ముస్లింలు క్రికెట్ ఆడటం మానేశారా? ఈ విధంగా ఎందుకు జరుగుతోంది?' అంటూ మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ సోషల్ మీడియా ద్వారా బీసీసీఐను ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు భారత స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. 'క్రీడల్లోకి కులం, మతం, రంగును తీసుకురాకండి' అంటూ మండిపడ్డాడు. దేశానికి ఆడే ప్రతి ఆటగాడూ 'హిందుస్థానీ'యే అని సమాధానం ఇచ్చాడు. ఆటగాడు హిందువైనా, ముస్లిం అయినా, సిక్కు అయినా, క్రిస్టియన్ అయినా, మరెవరైనా సరే... వాళ్లంతా దేశానికే ఆడుతారని చెప్పాడు. కులమతాలకు అతీతంగా ఆటగాళ్లంతా సోదరభావంతో మెలుగుతారని చెప్పాడు. మరోవైపు, న్యూజిలాండ్ తో జరిగే టీ20 సిరీస్ కు, శ్రీలంకతో జరిగే రెండు టెస్టులకు హైదరాబాద్ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ స్థానం దక్కించుకున్నాడు.

More Telugu News