ప్రతి పైసాకి లెక్క ఉంది... నేను భయపడను: 'జీఎస్టీ' అధికారుల దాడులపై సినీ నటుడు విశాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రతి పైసాకి లెక్క ఉంది... నేను భయపడను: 'జీఎస్టీ' అధికారుల దాడులపై సినీ నటుడు విశాల్

  • మెర్సల్ సినిమా వివాదంపై స్పందించిన విశాల్
  • విశాల్ కు జీఎస్టీ అధికారుల నోటీసులు
  • భయపడాల్సిన పని లేదని, తనవద్ద పక్కా లెక్కలున్నాయన్న విశాల్
  • ప్రతి ప్రశ్నకి సమాధానం చెబుతానంటూ వ్యాఖ్య
తన దగ్గర ప్రతి పైసాకి లెక్క ఉందని సినీ నటుడు విశాల్ తెలిపాడు. చెన్నైలోని విశాల్ నివాసంపై జీఎస్టీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విశాల్ స్పందించాడు. అధికారులు వేసిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతానని అన్నాడు. మెర్సల్ సినిమాపై తాను చేసిన ట్వీట్ కు, ఈ దాడులకు సంబంధం ఉందని భావించడం లేదని చెప్పాడు. నిర్మాతల ప్రయోజనాలే తనకు ముఖ్యమని విశాల్ స్పష్టం చేశాడు.

 రాజకీయాలు ముఖ్యం కాదని అన్నాడు. మెర్సల్ సినిమా వివాదానికి పరిష్కారం కావాలని అన్నాడు. ఒక జాతీయ పార్టీ జాతీయ కార్యదర్శిగా వున్న హెచ్. రాజా తాను పైరసీ సినిమా చూశానని అన్నారని, అది తప్పు అన్న విషయం ఆయనకు కూడా తెలుసని విశాల్ తెలిపాడు. ఇది చట్టరీత్యా నేరమని ఆయన స్పష్టం చేశాడు. ఆయన వ్యాఖ్యలు పైరసీని ప్రోత్సహించడమేనని విశాల్ అభిప్రాయపడ్డాడు. 
vishal
mersel
gst
bjp
comments

More Telugu News