madhyapradesh: మధ్యప్రదేశ్ లో దారుణం... వేధింపులపై ఫిర్యాదు చేసిన తండ్రిని తగులబెట్టేశారు

షార్ట్స్‌లో చూడండి
కూతుర్ని వేధించాడని కేసుపెట్టిన తండ్రిని తగులబెట్టిన దారుణమైన ఘటన మధ్యప్రదేశ్‌ లో చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్ లోని హట్టా పట్టణంలో నర్మదా సాహు (44) అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తెను సచిన్ సాహు (19) వేధింపులకు గురి చేసేవాడని ఆరోపిస్తూ అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై ఆగ్రహానికి గురైన నిందితుడు సచిన్.. రామ్‌ కుమార్‌ సాహు (35), రాజ్‌ కుమార్‌ సాహు (34)లతో కలసి నర్మదా సాహుపై కిరోసిన్ పోసి తగులబెట్టేశాడు. దీంతో తీవ్రగాయాల పాలైన నర్మదా సాహు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, తన కుమార్తెను సచిన్‌ సాహు వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసినందుకే తన భర్తను చంపేశారని మృతుడి భార్య ఆరోపించగా, పోలీసు విచారణలో తనను ఎవరూ వేధించలేదని మృతుడి కుమార్తె వాంగ్మూలమివ్వడం కలకలం రేపుతోంది. 
Go Back to Shorts
madhyapradesh
hatta
harassment
murder

More Telugu News