మరో వివాదంలో మియా ఖలీఫా!
- మలాలానా? మియా ఖలీఫానా? అంటూ విమర్శలు
- శృంగారాన్ని జీవనోపాధిగా మలచుకున్న మియా ఖలీఫా
- వర్జిన్ మేరీ ఫోటోలో ముఖాన్ని మియా ఖలీఫా ముఖంతో మార్ఫింగ్
మియా ఖలీఫా పోర్న్ స్టార్ అన్న సంగతి తెలిసిందే. లెబనీస్ యువతి అయిన మియా ఖలీఫా బుర్ఖా ధరించి బ్లూ ఫిలిమ్స్ లో నటించడంపై ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఆగ్రహం వ్యక్తం చేసి, చంపేస్తామని హెచ్చరించడంతో అమెరికా వెళ్లిపోయి, క్రైస్తవం స్వీకరించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె క్రైస్తవులకు పూజ్యనీయమైన మదర్ మేరీ ఫోటోలోని ముఖాన్ని తన ఫోటోతో మార్ఫింగ్ చేసి పెట్టింది.
ఇప్పుడిది పెను దుమారం రేపుతోంది. వివాదానికి అసలు కారణమేంటంటే... 'మదర్ మేరీ'ని 'వర్జిన్ మేరీ' అంటారు. అలాంటి 'వర్జిన్ మేరీ' స్థానంలో శృంగారమే జీవనోపాధిగా మలచుకున్న మియా ఖలీఫా ముఖాన్ని ఉంచడంపై క్యాథలిక్కుల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది.