ఒకటి కానున్న కన్నడ హీరో, హీరోయిన్లు... వైభవంగా సర్జా, మేఘన నిశ్చితార్థం

  • బెంగళూరులో వైభవంగా నిశ్చితార్థం
  • మేఘన ఇంట్లో కార్యక్రమం
  • ఆపై లీలా ప్యాలెస్ లో విందు
  • త్వరలో వివాహం
వెండితెరపై రొమాన్స్ పండించిన మరో జంట నిజ జీవితంలో ఒకటికానుంది. కన్నడ నటుడు చిరంజీవి సర్జా, హీరోయిన్ మేఘనా రాజ్ ల నిశ్చితార్థం బెంగళూరు జేపీ నగర్ లో సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరువురి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. తమ బిడ్డను వివాహం చేసుకునేందుకు వచ్చిన సర్జా కుటుంబీకులకు పూలహారాలతో స్వాగతం పలికిన మేఘన కుటుంబసభ్యులు, వారందరికీ ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు.

వైట్ అండ్ వైట్ లో సర్జా, ఎరుపు రంగు పట్టుచీరలో మేఘన మెరిసిపోతూ ఉంగరాలు మార్చుకున్నారు. ఆపై సాయంత్రం లీలా ప్యాలెస్ లో విందు జరుగగా, గులాబీ రంగు గౌనులో మేఘన, నీలి రంగు షర్ట్ లో సర్జా కనిపించారు. వీరిద్దరి కుటుంబాలూ కన్నడి సినీ పరిశ్రమకు సుపరిచితమే. మేఘన తల్లిదండ్రులు సుందర్ రాజ్, ప్రమీలా కన్నడ తెరపై నటించి మెప్పించారు. హీరో అర్జున్ సర్జా సోదరి కుమారుడిగా పరిచయమైన చిరంజీవి సర్జా పలు హిట్ చిత్రాల్లో నటించారు. మేఘనతో కలిసి ఆయన నటించిన 'ఆటగార' సినిమా సూపర్ హిట్.
Go Back to Shorts
sarja
meghana
kannada movies

More Telugu News