serena williams: తల్లి అయిన సెరీనా పెళ్లికి సిద్ధమవుతోంది!

షార్ట్స్‌లో చూడండి
గత నెలలో పండంటి పాపకు జన్మనిచ్చి మాతృత్వంలోని మధురానుభూతులను ఆస్వాదిస్తున్న అమెరికా టెన్నిస్ క్వీన్ సెరెనా విలియమ్స్ త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. మిలియనీర్ అలెక్సిస్ ఒహానియన్‌తో ఇప్పటికే నిశ్చితార్థం కాగా, ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమవుతోంది. పెళ్లి ఏర్పాట్లలో ప్రేమికులిద్దరూ బిజీగా ఉన్నారు.

పెళ్లికి పెద్ద ఎత్తున అతిథులను ఆహ్వానించాలని నిర్ణయించుకున్న సెరెనా, అలెక్సిస్‌లు ఇందుకు సంబంధించిన లిస్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. వెడ్డింగ్ ప్లాన్‌ కోసం ఇద్దరూ కలిసి ప్రత్యేక విమానంలో న్యూ ఓర్లాండో వెళ్లి అక్కడి మెర్లిన్ రెస్టారెంట్‌లో వెడ్డింగ్ ప్లానర్లతో సమావేశమయ్యారు. ఈ నెలాఖరు, లేదంటే వచ్చే నెల మొదట్లోనే సెరెనా, అలెక్సిస్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

Go Back to Shorts
serena williams
tennis
marriage

More Telugu News