కేన్సర్ బాధితురాలికి షారుక్ ఖాన్ వీడియో మెసేజ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేన్సర్ బాధితురాలికి షారుక్ ఖాన్ వీడియో మెసేజ్!

  • ఫోన్లో కూడా మాట్లాడిన న‌టుడు
  • నెటిజన్ల రిక్వెస్ట్‌కి స్పందించిన బాలీవుడ్ బాద్‌షా
  • #SRKMeetsAruna అంటూ ప్ర‌చారం క‌ల్పించిన సోష‌ల్ మీడియా
అరుణా పీకే, ఓ కేన్స‌ర్ బాధితురాలు. ఆరేళ్లుగా కేన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న ఆమె జులైలో కొన్ని ట్వీట్లు చేసి వార్త‌ల్లోకెక్కింది. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని, ఆయ‌న‌ను క‌ల‌వ‌డ‌మే త‌న చివ‌రి కోరిక అని ఆమె ట్వీట్ల సారాంశం. ఇటీవ‌ల ఆమె ఆరోగ్యం కొద్దిగా క్షీణించింది. దీంతో ఆమె పిల్ల‌లు ప్రియాంక, అక్ష‌త్‌లు త‌న త‌ల్లి చివ‌రి కోరిక‌ను తీర్చాల‌నుకున్నారు. అందుకోసం #SRKMeetsAruna అనే హ్యాష్‌ట్యాగ్‌తో హాస్పిట‌ల్ బెడ్ మీద ధైర్యంగా న‌వ్వులు చిందిస్తున్న అరుణ ఫొటోల‌ను ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. నెటిజ‌న్లంతా క‌లిసి ఈ హ్యాష్‌ట్యాగ్‌ను షారుక్ ఖాన్‌కి చేరే వ‌ర‌కు షేర్లు చేశారు. నిన్న ఈ హ్యాష్‌ట్యాగ్ ట్విట్ట‌ర్‌లో ట్రెండింగ్ మారింది.

ఎట్ట‌కేల‌కు వారి ప్ర‌య‌త్నం ఫ‌లించింది. షారుక్ ఖాన్ ప్ర‌త్య‌క్షంగా వ‌చ్చి అరుణ‌ను క‌ల‌వ‌క‌పోయినా... ఓ వీడియో మెసేజ్‌, ఫోన్ కాల్ ద్వారా అరుణ క్షేమ‌స‌మాచారాలు అడిగి తెలుసుకున్నాడు. ఆ వీడియోలో అరుణ క్షేమంగా ఉండాల‌ని, త్వ‌ర‌గా కోలుకోవాల‌ని, క‌ల‌వ‌డానికి ప్ర‌య‌త్నిస్తాన‌ని షారుక్ పేర్కొన్నాడు. షారుక్ స్పంద‌న‌పై అరుణ‌తో పాటు ఆమె పిల్ల‌లు, ఇత‌ర నెటిజ‌న్లంద‌రూ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.
srk
video message
cancer
aruna pk
priyanka
akshat
trending
twitter

More Telugu News