'అరె భయ్యా!.. ఒక్క సెల్ఫీ' అంటూ ఆ అబ్బాయి నన్ను పలకరించాడు: 'దంగల్' ఫేం జైరా
- ఆ అబ్బాయి నన్ను కూడా అబ్బాయి అనుకున్నాడు
- 'దంగల్ లో నా క్రాప్ చూసి అలా పొరబడ్డాడు' అంటున్న జైరా
- పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ‘సీక్రెట్ సూపర్ స్టార్’
ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ, ‘దంగల్’ లో చిన్నారి గీతా ఫొగాట్ పాత్రలో నటించిన తరువాత కొన్ని రోజులకు ఒక అబ్బాయి తన దగ్గరకి వచ్చి, ‘అరె భయ్యా.. మీరు ఆమిర్ ఖాన్ సినిమాలో ఉన్నారు కదా? ఒక సెల్ఫీ తీసుకుంటాను’ అన్నాడని చెప్పి నవ్వింది.
అంటే తనను అతను అబ్బాయి అనుకున్నాడని, ఆ సినిమాలో జుట్టు కత్తిరించుకుని అచ్చం అబ్బాయిలా కనిపించడంతో తనను అబ్బాయిగా పొరబడ్డాడని చెబుతూ జైరా నవ్వేసింది.