గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్... భారత్‌లో అత్యంత నమ్మకమైన బ్రాండ్లు!
- తర్వాతి స్థానాల్లో మారుతీ సుజుకీ, ఆపిల్
- ప్రపంచంలో అమెజాన్ బ్రాండ్ అత్యంత నమ్మకమైనది
- కోన్ అండ్ వోల్ఫీ సర్వేలో వెల్లడి
67 శాతం మంది భారతీయ వినియోగదారులు బ్రాండ్ పేరు చూసే కొనడానికి మొగ్గుచూపుతున్నారని ఈ సర్వే వెల్లడించింది. అలాగే సంస్థలు చాలా నిజాయితీగా ఉంటే బ్రాండ్ ప్రాచుర్యం పొందుతుందని 37 శాతం మంది చెప్పినట్లు పేర్కొంది. అలాగే సేవలకు సంబంధించిన విషయంలో బ్రాండ్ల కంపెనీలదే పూర్తి బాధ్యత ఉంటుందని 38 శాతం మంది వెల్లడించినట్లు తెలిపింది. వినియోగదారుడికి ఎల్లప్పుడూ సేవలందించే బ్రాండ్లను భారతీయులు ఎక్కువగా ఆదరించారని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అత్యంత నమ్మకమైన బ్రాండ్‌గా పేరు సంపాదించుకున్నట్లు రిపోర్టు తెలిపింది. తర్వాతి స్థానాల్లో ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, పేపాల్ బ్రాండ్లు ఉన్నాయి. 15 దేశాల్లో రెండు నెలల పాటు 1400 బ్రాండ్ల మీద సర్వే చేసి ఈ నివేదికను రూపొందించినట్లు కోన్ అండ్ వోల్ఫీ తెలిపింది.