హైదరాబాద్ 'సెక్స్ రాకెట్ క్వీన్' నిషా ఖాన్ అరెస్ట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ 'సెక్స్ రాకెట్ క్వీన్' నిషా ఖాన్ అరెస్ట్!

  • పాత బస్తీ కేంద్రంగా నిషా ఖాన్ సెక్స్ రాకెట్
  • పేదింటి అమ్మాయిలే తొలి టార్గెట్
  • వలపన్ని పట్టుకున్న పోలీసులు
పాతబస్తీ కేంద్రంగా ముఠాను తయారు చేసుకుని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సెక్స్ రాకెట్ ను నిర్వహిస్తున్న లేడీ డాన్ నిషా ఖాన్ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడింది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, గతంలో పలుమార్లు వ్యభిచారం చేస్తూ పట్టుబడి జైలుకు వెళ్లొచ్చి కూడా వైఖరి మార్చుకోని నిషా ఖాన్, గత మూడేళ్లుగా పంథా మార్చుకుంది.

పేదింటి అమ్మాయిల తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపి వారిని కొనుగోలు చేసి, బలవంతంగా రొంపిలోకి దింపి డబ్బులు సంపాదించడం మొదలు పెట్టింది. వారితో బలవంతంగా వ్యభిచారం చేయించేది. ఆమె బారినుంచి తప్పించుకున్న ఇద్దరు బాలికలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూపీ లాగిన పోలీసులు, ఉప్పల్ లోని హ్యాపీ హోమ్స్ లో నిషా ఖాన్ ఉందని, అక్కడే వ్యభిచార గృహాన్ని నడుపుతోందని గుర్తించారు. దాడి చేయగా, ముగ్గురు విటులు, నలుగురు అమ్మాయిలతో కలసి నిషాఖాన్ పట్టుబడింది. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు నిషా ఖాన్ నేతృత్వంలో నడుస్తున్న ఇతర వ్యభిచార గృహాలపై దృష్టిని సారించారు.
nisha khar
S*x queen
old city
hyderanad

More Telugu News