మరోసారి హీరోగా మారుతోన్న కమెడియన్!
- కమెడియన్ గా శ్రీనివాస్ రెడ్డికి మంచి పేరు
- అప్పుడప్పుడు హీరోగా ప్రయత్నాలు
- 'మను' దర్శకుడిగా రొమాంటిక్ కామెడీ
ఇటీవల వచ్చిన 'ఆనందోబ్రహ్మ' .. మొన్న విడుదలైన 'రాజా ది గ్రేట్' శ్రీనివాస్ రెడ్డికి మరింత మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి హీరోగా మారుతున్నాడు. గతంలో సుమంత్ అశ్విన్ తో 'రైట్ రైట్' సినిమా చేసిన దర్శకుడు 'మను' .. ఓ రొమాంటిక్ కామెడీని తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో కథానాయకుడిగా శ్రీనివాస్ రెడ్డిని ఎంపిక చేసుకున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.