hebba patel: ఆ అయిదు అంశాలు ఈ సినిమాకి హైలైట్ : హెబ్బా పటేల్

  • హెబ్బా పటేల్ ప్రధాన పాత్రగా 'ఏంజెల్' 
  • టైటిల్ రోల్ చేయడంలో ఆనందం 
  • ఆకట్టుకోనున్న 'నక్షత్ర' పాత్ర 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు

తెలుగులో కుర్ర హీరోలతో జోడీ కడుతూ హెబ్బా పటేల్ సక్సెస్ ఫుల్ గా తన కెరియర్ ను కొనసాగిస్తోంది. ఆమె తాజా చిత్రంగా 'ఏంజెల్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆమె ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా విశేషాలను పంచుకుంది. ఇది సోషియో ఫాంటసీ సినిమా అనీ .. ఇందులో తాను 'నక్షత్ర' పేరుతో కనిపిస్తానని చెప్పింది.

 తన పాత్రలో రెండు వేరియేషన్స్ ఉంటాయనీ .. ఈ తరహా పాత్రను పోషించడం ఇదే మొదటిసారి అని అంది. మరోసారి టైటిల్ రోల్ చేసినందుకు ఆనందంగా ఉందని చెప్పింది. ఈ సినిమాకి తన పాత్ర .. కథ .. గ్రాఫిక్స్ .. సంగీతం .. సినిమాటోగ్రఫీ హైలైట్స్ గా నిలుస్తాయని అంది. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా, అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది.      

More Telugu News