పుస్తకాల బ్యాగ్ బరువు మోయలేక విద్యార్థిని మృతి
- 12 కేజీల బరువైన బ్యాగుతో 3 అంతస్తుల మెట్లు ఎక్కిన బాలిక
- బాల్కనీలో కుప్పకూలి, అపస్మారక స్ధితిలోకి వెళ్లింది
- ప్రథమ చికిత్స అనంతరం ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి
వెంటనే అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. పాఠశాల నిర్వాహకులు ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఆ ఆసుపత్రి నుంచి వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా, ప్రాణాలు విడిచింది. దీంతో శ్రీవర్షిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
పుస్తకాల బ్యాగు అతి బరువు, తరగతి గది మూడో అంతస్తులో వుండటమే విద్యార్థిని మృతికి కారణమని పలువురు అభిప్రాయపడుతుండగా, విద్యాశాఖ నిబంధనల ప్రకారం 9, 10 తరగతుల విద్యార్థుల పుస్తకాల బ్యాగు బరువు 6 కేజీల లోపే ఉండాల్సి ఉంటుంది. కాగా, నిబంధనలకు విరుద్ధంగా బాలిక బండెడు పుస్తకాలు మోయాల్సి రావడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.