కాసేపు ఆగండి, అన్నీ చెబుతా... చంద్రబాబు ఇంటికి బయలుదేరుతూ బుట్టా రేణుక
- నేడు పచ్చ కండువా కప్పుకోనున్న బుట్టా రేణుక
- ఉదయం 10 గంటలకు బాబు సమక్షంలో టీడీపీ తీర్థం
- ఆ తరువాత మాట్లాడతానన్న కర్నూలు ఎంపీ
కాగా, విజయవాడలో తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబును కలిసిన తరువాత, తాను పార్టీ మారడానికి గల కారణాలను వెల్లడిస్తానని బుట్టా రేణుక తెలియజేయడం గమనార్హం. బుట్టా రేణుకతో పాటు కర్నూలు, పాణ్యం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది అభిమానులు కూడా చంద్రబాబు ఇంటి వైపు కదులుతున్నారు.