కాలేజీల్లో స్టూడెంట్ పోలీసింగ్: ఏపీ సర్కారు కీలక నిర్ణయం
- విద్యార్థులతో ఓ కమిటీ
- సహచరుల్లో ఒత్తిడిని కనిపెట్టాల్సిన బాధ్యత వారిదే
- ఎవరిపైనా ప్రెజర్ తీసుకురావద్దు
- కార్పొరేట్ కళాశాలలతో ఏపీ మంత్రి గంటా
ప్రతి కళాశాలలో విద్యార్థులతో కూడిన పోలీసింగ్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఏ కాలేజీలో కూడా చదువుకోవాలని విద్యార్థులపై ఒత్తిడి తేరాదని సూచించారు. ఇటీవలి కాలంలో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు పెరుగుతూ ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసిన గంటా, మరోసారి ఇటువంటివి జరుగకుండా చూసుకోవాలని కళాశాలల యాజమాన్యాలకు సూచించారు.