ఇంతకన్నా సిగ్గుచేటు మరొక్కటి లేదు: 'హెచ్ సీఏ'పై అజారుద్దీన్ ఫైర్

  • వర్షం లేకపోయినా మ్యాచ్ ను నిర్వహించలేకపోయారు
  • హెచ్ సీఏ అసమర్థంగా వ్యవహరించింది
  • అంతర్జాతీయ మ్యాచ్ ను నిర్వహించేటప్పుడు ఇలాగేనా వ్యవహరించేది
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) పై భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మండిపడ్డారు. నిన్నటి టీ20 మ్యాచ్ నిర్వహణ విషయంలో హెచ్ సీఏ చాలా అసమర్థంగా వ్యవహరించిందని విమర్శించారు. అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ ను నిర్వహించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలని... కానీ, హెచ్ సీఏ ప్రొఫెనల్ గా వ్యవహరించలేకపోయిందని అన్నారు. గువాహటిలో రెండో టీ20కి కూడా వర్షం అడ్డంకిగా మారిందని... అయినా వారు మ్యాచ్ ను నిర్వహించగలిగారని చెప్పారు. కానీ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం ఆ పని చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. వర్షం లేకపోయినప్పటికీ, మ్యాచ్ ను నిర్వహించలేకపోవడం సిగ్గుచేటని అన్నారు.
Go Back to Shorts
azharuddin
hca
t20

More Telugu News