కొట్టుకున్న తెలుగు తమ్ముళ్లు.. ఎమ్మెల్యేకు గాయాలు
- ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో గొడవ
- అడ్డుకోబోయిన ఎమ్మెల్యేకు గాయాలు
- గుంతకల్లులో చోటు చేసుకున్న ఘటన
అక్కడే ఉన్న ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ఇరు వర్గాల వారు ఒక్కసారిగా దూసుకురావడంతో... ఆయన కాలికి గాయమైంది. మరోవైపు ఈ ఘటన టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. వీధుల్లో పరస్పర దాడులకు తెగబడితే, పార్టీ పరువు ఏమవుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.