కొత్త అస్త్రాన్ని బయటకు తీసిన రిలయన్స్ జియో... రూ. 399 రీచార్జ్ చేస్తే 100 శాతం క్యాష్ బ్యాక్
- మరో ధరల యుద్ధానికి శ్రీకారం
- రూ. 399 రీచార్జ్ చేసుకుంటే రూ. 50 విలువైన 8 ఓచర్లు
- దీపావళి వరకూ అందుబాటులో ఆఫర్
'జియో దివాలీ ధన్ ధనా ధన్' ఆఫర్ లో భాగంగా దీనిని అందుకోవచ్చని తెలిపింది. మూడు నెలల పాటు చెల్లుబాటయ్యే రూ. 399 రీచార్జ్ తో రూ. 50 విలువగల 8 ఓచర్లు లభిస్తాయని, వీటిని నవంబర్ 15 తరువాత రీచార్జ్ కూపన్లుగా వాడుకోవచ్చని, ఈ ఆఫర్ నేటి నుంచి దీపావళి వరకూ అందుబాటులో ఉంటుందని తెలిపింది. కాగా, ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జీలను గణనీయంగా తగ్గిస్తూ ట్రాయ్ నిర్ణయం తీసుకున్న తరువాత, అత్యధికంగా లాభపడిన సంస్థగా రిలయన్స్ జియో నిలిచిన సంగతి తెలిసిందే.