kurnool district: కర్నూలు జిల్లాలో భూమి నుంచి పొగలు, వింత శబ్దాలు

షార్ట్స్‌లో చూడండి
కర్నూలు జిల్లాలో భూమి నుంచి వింత శబ్దాలు, పొగలు వస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. జిల్లాలోని హాలహర్వి మండలం యంకెపల్లిలో భూమి నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. భారీ శబ్దం చేస్తూ పొగలు ఎగసి పడ్డాయి. ఈ నేపథ్యంలో, ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఇలా ఎందుకు జరుగుతోందంటూ కలవరపడుతున్నారు. ఈ ఉదయం 7 గంటల సమయంలో రైతులు పొలం పనులు చేసుకునేందుకు వెళ్లారు. ఈ సమయంలోనే హఠాత్తుగా ఈ పరిణామం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి వచ్చేలోగానే పొగలు ఆగిపోయాయి. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. 
Go Back to Shorts
kurnool district
halaharvi mandal

More Telugu News