shankar: 'భారతీయుడు' సీక్వెల్ బడ్జెట్ 200 కోట్లు!

షార్ట్స్‌లో చూడండి
భారీతనం శంకర్ సినిమాల ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. బలమైన కథా కథనాలతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సినిమాలను తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత. 'రోబో' సీక్వెల్ గా '2.0' సినిమా పనుల్లో వున్న శంకర్, ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగానే, 'భారతీయుడు' సీక్వెల్ పై దృష్టి పెట్టనున్నారు.

 గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన 'భారతీయుడు' ఒక సంచలనం. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ ను తెరకెక్కించడానికి ఆయన రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్న దిల్ రాజు, 200 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకి స్క్రిప్ట్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. తెలుగు .. తమిళ భాషల్లో రూపొందే ఈ సినిమాను, ఇతర భాషల్లోను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.  
Go Back to Shorts
shankar
kamal

More Telugu News