128 ఏళ్ల క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన దక్షిణాఫ్రికా
- సెంచరీలు బాదిన నలుగురు బ్యాట్స్‌మెన్లు
- శ్రీలంకపై గతంలో ఉన్న రికార్డూ కనుమరుగు
- బంగ్లాదేశ్ ఘోర పరాజయం
ఈ టెస్ట్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 573 పరుగులు చేసింది. నలుగురు బ్యాట్స్‌మెన్లు డీన్ ఎల్గర్ (113), అయిడెన్ మార్కరమ్ (143), హషీం ఆమ్లా (132), ఫా డు ప్లెసిస్ (135) సెంచరీలు చేయడం విశేషం. కాగా, బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 172 పరుగులు చేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది.