గల్ఫ్ లో వరించిన అదృష్ట దేవత... రాత్రికి రాత్రే కోటీశ్వరులైన 8 మంది భారతీయులు!
- లాటరీ గెల్చుకున్న 10 మంది విజేతలు
- పదిమందిలో 8 మంది భారతీయులే
- ఒక్కో వ్యక్తికి 1.76 కోట్ల రూపాయల నజరానా
ఈ నేపథ్యంలో తాజాగా యూఏఈలో నిర్వహించిన బిగ్ టికెట్ డ్రా నెలవారీ లాటరీలో పదిమంది విజేతలను ప్రకటించారు. ఇందులో ఎనిమిది మంది భారతీయులు కాగా, మిగిలిన ఇద్దరూ ఫిలిప్పీన్స్, కెనడా దేశాలకు చెందినవారు కావడం విశేషం. లాటరీ మొత్తం 17.6 కోట్ల రూపాయలను వీరందరికీ ఒక్కొక్కరికి 1.76 కోట్ల రూపాయల చొప్పున పంచుతారు. లాటరీలో విజయం సాధించడం ఆనందంగా ఉందని విజేతలు తెలిపారు.