మరోసారి షారూఖ్ ఖాన్ కు షాక్ ఇచ్చిన ముంబై మున్సిపల్ అధికారులు!
- ముంబైలోని గోరేగామ్ లో 'రెడ్ చిల్లీస్' కార్యాలయం
- ఇందులో నిబంధనలకు విరుద్ధంగా 2,000 చదరపు అడుగుల ఫ్లోర్ నిర్మాణం
- అక్రమ కట్టడంగా గుర్తించి కూల్చవేత
- గతంలో ఇంటి ముందు నిర్మించిన ర్యాంప్ ను కూడా కూల్చేశారు
అయితే ఈ భవనంలోని నాలుగో అంతస్తులో నిబంధనలకు విరుద్ధంగా 2,000 చదరపు అడుగుల ఫ్లోర్ ను నిర్మించారు. దీనిని అక్రమ కట్టడంగా గుర్తించిన బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చేశారు. కాగా, 2015లో ముంబైలోని బాంద్రాలో గల తన నివాసం 'మన్నత్' ముందు, తన కారవాన్ వాహనం కోసం రోడ్డు మీదకి వచ్చేలా అక్రమంగా ర్యాంపు నిర్మించాడు. దీనిని కూడా అప్పట్లో బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చేశారు. రాత్రికి రాత్రే వారు కూల్చేయడం అప్పట్లో కలకలం రేపింది.