నేడే చై, శామ్ ల వివాహ వేడుక... గోవా చేరిన స్టార్ సినీ కుటుంబాలు!
- గోవాలోని వెగాటర్ బీచ్ లోని డబ్ల్యూ హోటల్ లో టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ వెడ్డింగ్
- ఈ రోజు తెలుగు హిందూ సంప్రదాయ పధ్ధతిలో వివాహం
- రేపు క్రైస్తవ సంప్రదాయంలో వివాహం
ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నం 3 గంటలకు మెహందీ వేడుక ప్రారంభం కానుంది. 6 గంటలకు ఈ వేడుక పూర్తికాగా, రాత్రి 8 గంటలకు విందు భోజనం ప్రారంభం కానుంది. రాత్రి 11.52 నిమిషాలకు పూర్తి తెలుగు హిందూ సంప్రదాయ పధ్ధతిలో వివాహం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు విందు భోజనం జరగనుంది. సాయంత్రం 5:30 గంటలకు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం.. ఆ తరువాత డిన్నర్, పార్టీ వుంటాయి.