ప్రియుడి బాటలోనే కొత్త బిజినెస్ ప్రారంభించిన అనుష్క శర్మ
- సొంత ఫ్యాషన్ బిజినెస్ ప్రారంభించిన అనుష్క
- అక్టోబర్ మొదటి వారం నుంచి మార్కెట్లోకి దుస్తులు
- ఇప్పటికే ఈ బిజినెస్ లో ఉన్న కోహ్లీ
కోహ్లీకి ఇప్పటికే 'రాంగ్' పేరిట సొంత ఫ్యాషన్ బిజినెస్ ఉంది. ఇప్పుడు ప్రియుడి బాటలోనే అనుష్క కూడా తన సొంత ఫ్యాషన్ బ్రాండ్ తో దుస్తుల బిజినెస్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా మీడియాతో అనుష్క మాట్లాడుతూ, దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించాలని గత నాలుగేళ్లుగా అనుకుంటున్నానని... ఈ రంగంలో తనకు చాలా ఆసక్తి ఉందని తెలిపింది. అక్టోబర్ మొదటి వారం నుంచి ఈ దుస్తులు వినియోగదారులకు లభించనున్నాయి.