కూతురి పేరు వెనక రహస్యాన్ని వెల్లడించిన సెరెనా విలియమ్స్
- `ఆస్ట్రేలియా ఓపెన్` అక్షరాలు కలిసేలా అలెక్సిస్ ఒలింపియా అని పేరు
- తనతో పాటు ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచిందన్న టెన్నిస్ స్టార్
- అభిమానులతో పంచుకున్న సెరెనా
తనతో పాటు తను కూడా ఆడి (కడుపులో వున్న పాప) ఆస్ట్రేలియా ఓపెన్ గెలవడంలో సహాయపడినందుకు ఈ పేరు పెట్టినట్లు ఆమె తెలిపింది. 2017 జనవరి 28న ఆమె ఆస్ట్రేలియా ఓపెన్ గెల్చుకుంది. ఇది ఆమె కెరీర్‌లో 23వ సింగిల్ గ్రాండ్‌స్లామ్ టైటిల్. అప్పటికే ఆమె 8 వారాల గర్భంతో ఉన్నట్లు తర్వాత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. సెప్టెంబర్ 1న ఆమె అలెక్సిస్‌కి జన్మనిచ్చింది.